అవనిగడ్డ నుంచి పవన్ కల్యాణ్ పోటీ: ఇక యాత్రతో ప్రజల్లోకి...

అవనిగడ్డ నుంచి పవన్ కల్యాణ్ పోటీ: ఇక యాత్రతో ప్రజల్లోకి...

అమరావతి: తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు జనసేన జిల్లా ఇంచార్జీ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ్ మండపంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశం సందర్భంగా మీడియాతో ఆ విషయం చెప్పారు. 

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నామని అన్నారు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే, పార్టీ నుంచి గానీ పవన్ కల్యాణ్ నుంచి గానీ దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు.

ఇదిలావుంటే, ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వారంలోపలే ఆయన రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు. 

యాత్ర పేరు, ప్రారంభం తేదీ ఖరారు కావాల్సి ఉంది. అలాగే ఎక్కడ ప్రారంభించి ఎక్కడకి వరకు ఈ యాత్ర ఉంటుందని ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ యాత్ర కోసం ప్రత్యేకంగా ఓ వాహనం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

ప్రధాన సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానకిి ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే విషయంపై కూడా పవన్ ఆలోచిస్తున్నారు. వాటిపై అక్కడికక్కడే ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page