ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అభ్యర్థిని బలపరిచారు. ఆమెకోసం ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. అయినా ఆమె ఓటమి పాలయ్యింది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెడితే.. అమలాపురం 10వ వార్డు జనసేన అభ్యర్థి ముత్యాల మణికుమారిని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా వీడియో సందేశంతో బలపరిచారు. అయితే ఆమెకు కేవలం 153 ఓట్లు మాత్రమే లభించాయి. 

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ అమరావతిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో 70యేళ్ల మణికుమారి పోటీ చేస్తుందని, ఆమె విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే జనసేన పార్టీ శ్రేణులు పరోక్షంగా వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే మణికుమారి ఓటమి పాలయ్యారు. కొందరు సీనియర్ నాయకులతో పాటు పార్టీలో ఉన్న కొందరు నాయకులపై జన సైనికులే బహిరంగ ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.