పవన్ కళ్యాణ్‌కు జ్వరం: వారాహి యాత్రకు బ్రేక్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  వారాహి యాత్రకు  రెండు రోజుల విరామం ప్రకటించారు. జ్వరం కారణంగా  పవన్ కళ్యాణ్  రెండు రోజుల పాటు  యాత్రకు  బ్రేక్ ఇచ్చారు. 

Pawan Kalyan  stops varahi Yatra for two days  lns

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది.  వారాహి యాత్రకు  పవన్ కళ్యాణ్ రెండు  రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నారు.  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో రెండు రోజుల పాటు  వారాహి యాత్రకు  పవన్ కళ్యాణ్ బ్రేక్  ఇవ్వనున్నారు.

ఈ నెల  14వ తేదీన  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి  జంక్షన్ నుండి యాత్రను  ప్రారంభించారు. తొలుత  ఉభయ గోదావరి జిల్లాల్లో  యాత్రను  పూర్తి చేయాలని  పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ రెండు  జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల్లో యాత్రను  పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు.  ఈ నెల  30వ తేదీన  భీమవరంలో నిర్వహించే  బహిరంగ సభలో  పవన్ కళ్యాణ్ పాల్గొంటారని  పార్టీ వర్గాలు  ప్రకటించాయి.

వారాహి యాత్ర  సందర్భంగా  స్థానికంగా  ఉన్న  మేథావులతో  పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  జనవాణి కార్యక్రమాలను  చేపడుతున్నారు.

వచ్చే ఏడాదిలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు  జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయం నాటికి   పార్టీని బలోపేతం  చేయాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.భీమవరం  సభ తర్వాత  వారాహి యాత్రకు  స్వల్పంగా  బ్రేక్ ఇవ్వనున్నారు.  ఈ విషయాన్ని   జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ  చైర్మెన్  నాదెండ్ల మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

2019  అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం,  గాజువాక నుండి పవన్ కళ్యాణ్  పోటీ చేశారు.ఈ రెండు  అసెంబ్లీ స్థానాల్లో  పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. అయితే  రానున్న  ఎన్నికల్లో   పవన్ కళ్యాణ్  భీమవరం నుండి పోటీ చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  ఈ తరుణంలో  భీమవరం సభకు  ప్రాధాన్యత నెలకొంది. 

ఈ దఫా అసెంబ్లీలోకి అడుగుపెడతామని  పవన్ కళ్యాణ్ ధీమాగా  చెబుతున్నారు.  ఈ దిశగా  జనసేన వ్యూహారచన చేస్తుంది.  అదే సమయంలో  ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో  జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.  తూర్పు గోదావరి జిల్లాలో  పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో  జోష్  నెలకొంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios