Asianet News TeluguAsianet News Telugu

ఆ కోవర్టుల వల్లే ప్రజారాజ్యంను నిలబెట్టుకోలేకపోయాం.. అలాంటప్పుడు ప్రత్యర్థులతో కూడా కలుస్తాం: పవన్ కల్యాణ్

వైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు జనసేన సిద్దంగా లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ తీయకుండా ఉండి ఉంటే.. మూడో ప్రత్యామ్నాయం ఉండేందని చెప్పారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలన్నారు. 

Pawan Kalyan Speech at Tirupati Janasena janani program
Author
First Published Aug 21, 2022, 5:43 PM IST

వైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు జనసేన సిద్దంగా లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ తీయకుండా ఉండి ఉంటే.. మూడో ప్రత్యామ్నాయం ఉండేందని చెప్పారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలన్నారు. తిరుపతిలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పవన్ కల్యాణ్ మాట్లారు. రాయలసీమలో దళితుల గొంతునొక్కెస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో గనులు, అటవీ సంపద దోపిడి జరుగుతుందని ఆరోపించారు. ప్రశ్నించినవారిపై దౌర్జన్యాలు, వేధింపులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెనకబడిన కులాలు, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు సాధికారత లేనంత.. రాయలసీమ అభివృద్ది జరగదని అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన యువత.. వెనకబడిన కులాలవారికి పెద్దన్నగా నిలబడాలని కోరారు. కులాల మధ్య ద్వేషం పెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. రాయలసీమ ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. తనను దత్త పుత్రుడు అంటారు కాబట్టి.. సీఎం జగన్‌కు ఆంధ్ర Thanos అని నామకరం చేస్తున్నానని పవన్ చెప్పారు.

వైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు జనసేన సిద్దంగా లేదని చెప్పారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినప్పుడు గొప్ప మార్పును ఆశించామని తెలిపారు. అయితే కొందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కోవర్టుల వల్ల.. ఆరోజు పార్టీని నిలబెట్టుకోలేకపోయాని చెప్పారు. ఈ రోజువారిలో కొందరికి మంత్రిపదువులు కూడా ఉన్నాయని అన్నారు. తాను ఎక్కడికి కదలనని.. ఇక్కడే ఉంటానని చెప్పానని అన్నారు. చిరంజీవిని జనాలు మార్పుకు సంకేతంగా చూశారని.. కానీ కుట్ర, కుళ్లు రాజకీయాలు ఆయనను నిలబడకుండా చేశాయని అన్నారు. కానీ తాను మాత్రం మార్పు తీసుకురావాలని.. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తానని చెప్పినట్టుగా తెలిపారు. చాలా మంది బెదిరించారని.. ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి తనను రావాలని సంకేతాలు పంపారని చెప్పారు. అయితే తాను ఎవ్వరికీ భయపడనని తెలిపారు. ఉన్న ఆస్తి లాగేసుకున్న భయపడేది లేదని.. ప్రజల కోసం నిలబడతానని చెప్పారు. చిరంజీవి మంత్రిగా ఉన్న సమయంలో తాను ఢిల్లీకి వెళ్లలేదని చెప్పారు. 

మునుగోడులో పోటీ చేయాలని తెలంగాణకు చెందిన కొందరు జనసేన నాయకులు కోరారని చెప్పారు. అయితే విధ్వంస రాజకీయాలు చేయడం ఇష్టంలేక.. మునుగోడులో పోటీ చేయడం లేదన్నారు. తెలంగాణ జనరల్ ఎన్నికల్లో బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. 

ఇప్పటికీ ఎవరితో కలిసి పోటీ చేయాలనే విషయంలో జనసేన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇంతటి విద్వేష పూరిత పరిస్థితులు ఉన్నవేళ.. ప్రత్యర్థులతో కూడా కలుస్తామని చెప్పారు. తమ పార్టీ వాళ్లకు గౌరవం ఇవ్వని చోట జనసేన పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం తన అఖరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పారు.  

తెలుగు సినీ పరిశ్రమ ఒక్క వర్గానిది కాదు.. 
తెలుగు సినీ పరిశ్రమ అంటే ఒక్క మెగా ఫ్యామిలీదో, కొద్ది మంది హీరోలదో, ఒక్క కులానిదో కాదని అన్నారు. నిఖిల్ హీరోగా వచ్చిన  కార్తీకేయ చిత్రం వచ్చి దేశం మొత్తం ఆడుతుందని చెప్పారు.

2014లో అందుకే టీడీపీకి మద్దతు.. 
‘‘2014 ఎన్నికల సమయంలో నాకు టీడీపీ రెండు మూడు సార్లు కబురు పంపిస్తే.. తాను మాట్లాడలేదు. అయితే టీడీపీతో కలిసి వెళ్తున్నామని అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీ చెప్పారు. జనసేన కూడా మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పారు. జనసేన మద్దతు కావాలంటే మీరు మా ఆఫీసుకు వచ్చి ఆతిథ్యం స్వీకరించమని చంద్రబాబుకు చెప్పాను. ఏం ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చాను’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. 

తమ స్ట్రాటజీని బయటకు చెప్పబోమని.. దానిని రహస్యం గా ఉంచుతామని తెలిపారు. తమ ఎన్నిక వ్యుహం సమయం వచ్చినప్పుడు చెబుతామని అన్నారు. వైసీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తమ విధానం అని చెప్పారు. ద్వేష పూరిత రాజకీయాలు చేసి, అందరినీ చావగొడుతుంటే వైసీపీ రాకూడదనే కోరుకుంటామని తెలిపారు. తమ స్ట్రాటజీ ఓపెన్ చేయలేదని.. అది చిదంబర రహస్యంగానే ఉంటుందన్నారు. 

వైసీపీ నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ ఎవరైనా రాజకీయ నాయకులు జనసేలోకి రావాలని అనుకుంటే అన్న ప్రశకు పవన్ సమాధానమిచ్చారు. ఒక్క ఎలక్షన్‌కు అయితే వద్దని చెబుతానని చెప్పారు. మా వాళ్లకు మర్యాద ఇవ్వాలని, వాడుకునే వస్తువులుగా తీసుకుంటే మాత్రం వద్దని అంటానని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios