హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను ఉద్దేశించి జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను వపన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

పవన్ జిల్లాల్లో నిర్వహించిన  పోరాట యాత్రలు, కవాతు సందర్భంగా పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్న విషయాన్ని  ఈ ట్వీట్ లో  జనసేన ప్రస్తావించింది.ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తోందో చూడాలి

 

సంబంధిత వార్తలు

చంద్రబాబుపై అలక: జనసేనలోకి అఖిలప్రియ?