Asianet News TeluguAsianet News Telugu

చర్చిలో పవన్ కల్యాణ్ కూతురికి నామకరణం

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిచారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్‌లో చెప్పిన మాటను తాను అనుసరిస్తానని చెప్పారు. 

Pawan Kalyan says he respects Bible
Author
Eluru, First Published Aug 12, 2018, 1:29 PM IST

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త విషయం చెప్పారు. తన కూతురికి చర్చిలోనే నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. తాను బైబిల్ నుంచి చాలా నేర్చుకున్నానని, సర్వమతాలను గౌరవిస్తానని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిచారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్‌లో చెప్పిన మాటను తాను అనుసరిస్తానని చెప్పారు. 

''ముఖ్య‌మంత్రి గారు ఆరోగ్యంగా జీవించే హ‌క్కు మీ ఇంట్లోవాళ్లకే కాదు... య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ ప‌క్క‌న నివ‌సిస్తున్న పిల్ల‌ల‌కు ఉంద‌"ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం భీమ‌వ‌రం స‌మీపంలోని మురుగు కాలువ‌గా మారి, తీవ్ర దుర్గంధం వెద‌జ‌ల్లుతున్న య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ ను ఆయన ప‌రిశీలించారు. 

దుర్వాస‌న వెద‌జ‌ల్లుతూ బుర‌ద‌మ‌యంగా మారిన కాలువ గ‌ట్టుపై కిలోమీటరు మేర నడిచి స్థానికుల క‌ష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డంపింగ్ యార్డ్ సమస్య బాధితులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందు త‌మ క‌ష్టాల‌ను ఏక‌రువు పెట్టారు. భీమ‌వ‌రంలో డంపింగ్ యార్డ్ కోసం 10 ఎక‌రాల భూమిని సేక‌రించార‌ని, ఏళ్లు గ‌డుస్తున్నా దాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని దీంతో సేక‌రించిన చెత్త‌ను య‌న‌మ‌దుర్రు కాలువ గ‌ట్టుపై డంప్ చేస్తున్నారని చెప్పారు.  

ఇక్క‌డ చెత్త‌ను డంప్ చేయ‌డం వ‌ల్ల పంట కాలువ నీళ్లు క‌లుషిత‌మ‌వుతున్నాయ‌ని, చెత్త నుంచి వ‌చ్చే దుర్వాస‌న వ‌ల్ల డీఎన్ఆర్ కాలేజీ విద్యార్ధుల‌తో పాటు సుమారు 25 గ్రామాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, 200 మంది పిల్ల‌లు చ‌దువుకొనే పాఠ‌శాల కూడ మూత‌ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డంపింగ్ యార్డ్ త‌ర‌లించాల‌ని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

డంపింగ్ యార్డ్ నుంచి వ‌చ్చే ఈగ‌లు, దోమ‌ల వ‌ల్ల స‌రిగ్గా భోజ‌నం చేయ‌లేక‌పోతున్నాం, నిద్ర‌పోలేకపోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  బాధితులు క‌ష్టాలు విని చ‌లిచిపోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ డంపింగ్ యార్డ్ స‌మ‌స్యను జ‌న‌సేన పార్టీ ప‌రిష్క‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా డంపింగ్ యార్డ్ ప‌క్క‌నే నివ‌సిస్తున్న పిల్ల‌ల‌తో ... 'మేము భావి భార‌త పౌరులం మాకు ఆరోగ్యంగా జీవించే హ‌క్కు ఉంది. ఒక్క మీ పిల్ల‌ల‌కే కాదు మాకు ఉంది. ద‌య‌చేసి ఆరోగ్య‌క‌ర‌మైన భీమ‌వ‌రం ఇవ్వండి' అని ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios