మాజీ ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ షాక్: అటు నుంచి అటే...

Pawan Kalyan rejects meet ex MLA
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యకు షాక్ ఇచ్చారు.

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యకు షాక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ను కలవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. పవన్ కల్యామ్ ఆదివారంనాడు అరకులోయలో, సోమవారం పాడేరులో పర్యటించాల్సి ఉంది. విజయనగరం జిల్లా నుంచి శనివారం రాత్రి ఆయన అరకు లోయకు చేరుకున్నారు. స్థానికంగా ఓ రిసార్టులో ఆయన బస చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన రిసార్టుకే పరిమితమయ్యారు.
 
గొంతునొప్పి కారణంగా ఆయన ఎవరినీ కలవలేదని అంటున్నారు. ఆదివారం సాయంత్రం అరకులోయలో నిర్వహించాల్సిన రోడ్‌షోను సోమవారానికి వాయిదా వేసినట్టు తెలిసింది.  ప్రజారాజ్యం పార్టీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఉదయం పవన్‌ కల్యాణ్‌ను కలడానికి వచ్చారు. అయితే ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన పవన్‌ పీఏతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు.
 
పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్‌పై జనసేన వర్గాలు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అభిమానులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. విజయనగరం జిల్లాలో ప్రజల నుంచి స్వీకరించిన వినతిపత్రాలను పరిశీలించడంతోపాటు విశాఖ మన్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆదివారం ఉదయం ఆయన అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. 
 
పవన్‌ బసచేసిన రిసార్టులోని మొత్తం గదులన్నింటినీ జనసేన  బుక్‌ చేయడంతో ఆదివారం ఇతరులకు గదులు అద్దెకు ఇవ్వలేదు. ఆయనను చూడడానికి అభిమానులు పెద్ద యెత్తునే వచ్చారు. అయితే ఎవరినీ కలవడం లేదని చెప్పడంతో చాలా మంది వెనుతిరిగారు. 

ఎట్టకేటకు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రిసార్టు నుంచి బయటకు వచ్చి, అభిమానులకు అభివాదం చేశారు. కొద్దిసేపటి తరువాత ఆయన తిరిగి లోపలికి వెళ్లిపోయారు. 

loader