వారి మరణం కలచివేసింది: పవన్ కల్యాణ్

pawan kalyan reaction against two deaths with current shock in payakarao pet
Highlights

వారి మరణం కలచివేసింది: పవన్ కల్యాణ్

జనపోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలుకేందుకు.. కొందరు కార్యకర్తలు పాయకరావుపేట భారీగా ఫ్లెక్సీలు కట్టారు... ఈ సమయంలో పవన్ ఫ్లెక్సీలు కడుతున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ తీగలు తగిలి.. విద్యుత్ షాక్‌‌తో మరణించారు. ఈ ఘటనపై పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి మరణం తనను కలచివేసిందని... వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శిస్తానని.. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని... అతి త్వరలో ఆర్థిక సాయాన్ని అందిస్తామని పవన్ ట్వీట్ చేశారు.

loader