ఉద్దానం కిడ్నీ బాధితుల నేపథ్యంలో 24 గంటల్లోగా ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని తాను చేసిన హెచ్చరికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు.

హైదరాబాద్‌: ఉద్దానం కిడ్నీ బాధితుల నేపథ్యంలో 24 గంటల్లోగా ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని తాను చేసిన హెచ్చరికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. ఆయన రేపు శనివారం సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తారు. 

 శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోతాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌ ప్రజల మధ్యనే దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి

 పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్‌, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనే ఉంటుందని వారు చెప్పారు.

గత రెండు రోజులుగా వాయిదా పడిన పవన్ కల్యాణ్ పోరాట యాత్ర శనివారంనాడు కూడా జరిగే అవకాశం లేదు. దీక్ష కారణంగా ఆయన యాత్ర సాగించలేరు.