కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ‌ బుధవారం నాడు కాకినాడలో జనసేన నేత పంతం నానాజీని పరామర్శించారు.

ఈ నెల 12వ తేదీన వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ల దాడి చేసుకొంది. ఈ రాళ్ల దాడిలో జనసేన కార్యకర్త పంతం నానాజీ గాయపడ్డారు. నానాజీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

ఈ నెల 12వ తేదీన వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ల దాడి చేసుకొంది. ఈ రాళ్ల దాడిలో జనసేన కార్యకర్త పంతం నానాజీ గాయపడ్డారు. నానాజీని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌పై కాకినాడ  ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు.

భానుగుడి సెంటర్ నుండి  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వైపుకు వెళ్తుండగా జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో పంతం నానాజీ గాయపడ్డారు. ఢిల్లీ పర్యటన నుండి  పవన్ కళ్యాణ్ నేరుగా కాకినాడకు చేరుకొని పంతం నానాజీని పరామర్శించారు.