పెళ్లి చేసుకోలేదు, రాహుల్ గాంధీ ఏమైనా బ్రహ్మచారా: పవన్ కల్యాణ్

First Published 27, Jul 2018, 10:02 PM IST
Pawan Kalyan lashes out at YS Jagan
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వాగ్బాణాలు విసిరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడని అన్నారు. దమ్ము, ధైర్యం, శక్తి జగన్‌కు లేవని అన్నారు. 

భీమవరం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వాగ్బాణాలు విసిరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోలేక జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయాడని అన్నారు. దమ్ము, ధైర్యం, శక్తి జగన్‌కు లేవని అన్నారు. 

భీమవరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే ప్రభుత్వాన్ని ఊపు ఊపేసేవాడినని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థను సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ నేత వీహెచ్ తన పెళ్లిళ్లపై మాట్లాడుతూ రాహుల్ పెళ్లి గురించి ప్రస్తావించారని, పెళ్లి చేసుకోనంత మాత్రానా బ్రహ్మచారా అని అన్నారు. తన జీవితంపై విమర్శలు చేసే వారికన్నా అన్ని కోణాల్లో తను అందరికంటే బెటర్ అన్నారు. 

 "పవిత్ర గురుపౌర్ణమి రోజు చెబుతున్నా.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాం" అని అన్నారు. జనసేన సిద్ధాంతాల గురించి , పవన్ కల్యాణ్ గురించి ఆలోచించాలని.. ప్రజా సమస్యలపై ఏ ప్రభుత్వం నిలబడుతుందో ఆ పార్టీకే ఓటెయ్యాలని అన్నారు. 

"మీరు నాపై బురద చల్లండి. దాడులు చేయండి. ఏమైనా చేయండి. నా దగ్గర జనసైనికులు ఉన్నారు. కత్తులు పట్టుకునే వీర మహిళలు ఉన్నారు"  అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు విప్లవాన్ని గుండెల్లో పెట్టుకున్నవాడినని, ఫ్యాక్షనిస్టులకు భయపడనని హెచ్చరించారు.
 
పోలీస్, రెవెన్యూశాఖల అధికారులు తమను మన్నించాలని బహిరంగ సభ ముగింపులో ఆయన కోరారు. తమ వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగితే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. 

loader