అమరావతి: 2014 ఎన్నికల్లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించామని, 2019 ఎన్నికల్లో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు ట్విటర్ లో రాశారు. 

అదే సమయంలో భూసేకరణ చట్టంపై కూడా ఆయన ట్విటర్ లో స్పందించారు. 2013 భూసేకరణ చట్టం అమలు కోసం ఏర్పడిన సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సభ్యులతో సమావేశాన్ని ముగించినట్లు ఆయన తెలిపారు. 

2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల తలెత్తుతున్న ప్రమాదకరమైన పరిణామాలపై సంబంధిత వ్యక్తులతో, మేధావులతో చర్చించేందుకు తమ పార్టీ విశాఖపట్నంలో వర్క్ షాప్ నిర్వహిస్తుందని చెప్పారు.