Asianet News TeluguAsianet News Telugu

seediri appalaraju : పవన్ కల్యాణ్ జనసేనను అమ్మేశాడు - మంత్రి సీదిరి అప్పలరాజు

పవన్ కల్యాణ్ జనసేనను అమ్మేశాడని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. ఏపీలో  టీడీపీ హయాంలో కో ఆపరేటివ్‌ డెయిరీలు దాదాపు నిర్వీర్యమైపోయాయని ఆరోపించారు.

Pawan Kalyan has sold Janasena - Minister Seediri Appalaraju..ISR
Author
First Published Nov 10, 2023, 5:49 PM IST

seediri appalaraju : పశువులు, మిల్క్‌ యూనియన్‌ డైరీల గురించి గత నాలుగైదు రోజులుగా ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయని, అసలేమీ లేనిదాన్ని  తెరమీదికి తెచ్చి కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ఆరోపణలు చేస్తున్నాయని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామనేది చెప్పుకోలేక ప్రజల్లో వారి ఉనికిని చాటుకునేందుకే భుత్వంపై బురదజల్లే విధంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Tula Uma : గొర్లు కాసుకునే వారు ఎమ్మెల్యే కావద్దా ?.. కంట తడి పెట్టిన తుల ఉమ..

ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కో ఆపరేటివ్‌ డెయిరీలు దాదాపూ నిర్వీర్యమైపోయాయని మంత్రి అన్నారు. దీనికి కారణం నాటి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే అని ప్రతీ ఒక్కరికీ తెలుసని చెప్పారు. తెలుగుదేశం హయాంలో ఈ రాష్ట్రంలో కో ఆరేటివ్‌ డెయిరీలు అసలు ఉన్నాయో లేవో అనే పరిస్థితి ఉండేదని విమర్శించారు. గుంటూరు, కృష్ణా, విశాఖ మిల్క్‌ యూనియన్‌ల డెయిరీలన్నింటినీ 1996 వరకున్న కో ఆపరేటివ్‌ యాక్ట్‌ స్థానంలో మ్యాక్స్‌ యాక్ట్‌ పరిధిలోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని అన్నారు. 

Hasanamba Temple Stampede : ప్రఖ్యాత హసనంబ ఆలయంలో కరెంట్ షాక్ తో తొక్కిసలాట.. 17 మందికి గాయాలు..

ఆయా యూనియన్లకు తన మనుషులనే ఛైర్మన్‌లుగా నియమించి.. వాటిని తన గుప్పిట్లోకి తీసుకున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. సంగం డెయిరీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఎలా వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. 1973లో ప్రభుత్వమే దానిని స్థాపించిందని అన్నారు. ఆ డైరీ ఖచ్చితంగా ప్రభుత్వ డైరీయే అని, దానిని ధూళిపాళ్ల నరేంద్ర కబ్జా చేశారని ఆరోపించారు. 

ప్రజా సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రతీ ఇళ్లు వెలిగిపోతోంది - ప్రధాని నరేంద్ర మోడీ..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న పాలవెల్లువ కార్యక్రమంతో అమూల్‌ రాష్ట్రానికి రాకముందు సంగం డెయిరీ గేదెపాలు లీటరుకు రూ.58.90 రైతుకు ఇచ్చేదని అన్నారు. అలాగే హెరిటేజ్‌ డెయిరీ రూ.58.43లు ఇచ్చేదని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో సంగం డెయిరీ రూ.69.35పైసలిస్తోందని తెలిపారు. హెరిటేజ్‌ డెయిరీ కూడా రూ.66.50 పైసలిస్తోందని గుర్తు చేశారు. 

ఓడలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

అనంతరం ఆయన జనసేన పార్టీపై విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్ రాజకీయంగా సెన్స్ బుల్‌ పర్సన్‌ కాదని అన్నారు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఆయనకు అమరావతి మంచి వేదికగా కనిపిస్తోందా అని అన్నారు. చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ఈగ కూడా వాలనీయడం లేదని అన్నారు. సొంత కుమారుడి కంటే ఆయనకే ఎక్కువ నొప్పి కలుగుతోందని చెప్పారు. అందుకే తాము ఆయనను దత్త పుత్రుడని అంటున్నామని చెప్పారు. జనసేనను పవన్ కల్యాణ్ అమ్మేశాడని కార్యకర్తలు గుర్తించాలని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios