జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏపీ ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్ లను కేటాయించింది. గతంలోనూ పవన్ కి గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే.. ఆ గన్ మెన్ ల ద్వారా తన పార్టీ రహస్యాలు
బయటపడుతున్నాయని.. అందుకే వారిని వెనక్కి పంపిస్తున్నట్లు పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.  కాగా.. మరోసారి  ఆయనకు ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.  అయితే.. ఈ పర్యటనలో ఎలాంటి సెక్యురిటీ లేకుండా పవన్ తన యాత్రను కొనసాగిస్తున్నారని జనసేన మీడియా ఇన్‌చార్జి పి.హరిప్రసాద్‌ అన్నారు.ఈ యాత్రలో పవన్ కి ఏదైనా జరిగితే.. దాని పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వారు మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు.

ఇచ్ఛాపురం పర్యటనలో భారీస్థాయిలో ప్రజలు, అభిమానులు వచ్చారని,  ఒకరిద్దరు పోలీసులతో రక్షణ ఇచ్చారే తప్ప వీఐపీ భద్రత కల్పించలేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. వెంటనే ఆయనకు ఇద్దరు గన్ మెన్లను కేటాయించింది.