సంచలనం: బయటపడిన పవన్ బండారం..రూ. 50 కోట్ల భూమి రూ. 40 లక్షలకే

సంచలనం: బయటపడిన పవన్ బండారం..రూ. 50 కోట్ల భూమి రూ. 40 లక్షలకే

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బండారం బయటపడింది. ఒకరిని ప్రశ్నించాల్సిన అధినేత ఇపుడు తానే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితిలో నిలబడ్డారు. ప్రశ్నించటం కోసమే పార్టీని పెట్టాను అని చెప్పుకునే పవన్ కల్యాణ్ అబాసు పాలయ్యారు. అమరావతి ప్రాంతంలో ఎప్పుడైతే రెండెకరాల్లో భూమి పూజ చేశారో అప్పటి నుండి పవన్ పై నెటిజన్ల దాడులు పెరిగిపోయాయి.

ఎందుకంటే, చేతిలో డబ్బులు లేవని తరచూ చెప్పుకున్న పవన్ ఒక్కసారిగా రెండెకరాల్లో భవనాలు కట్టడమంటే మాటలు కాదు. ముందు భూములు కొనాలి తర్వాత భవనాలు నిర్మించాలి. అమరావతి ప్రాంతంలో ఎకరం భూమి కొనాలంటే సుమారు రూ. 20 కోట్ల పై మాటే. ఇక భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయం అదనం.

తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న సమాచారం ప్రకారం పవన్ భూమిపూజ చేసిని ఖాజా గ్రామంలో ఎకరం ధర సుమారు రూ. 25 కోట్లట. అంత విలువైన భూమిని పవన్ కు భూ యజమాని ఎకరం రూ. 20 లక్షలకే అమ్మేశారు. ఎక్కడ రూ. 25 కోట్లు? ఎక్కడ రూ. 20 లక్షలు? ఎందుకిలా జరిగింది? అంటే సదరు భూయజమాని చంద్రబాబునాయుడుకు బాగా సన్నిహితుడైన లింగమనేని రమేషేనట. చంద్రబాబు ప్రస్తుతం నివాసముంటున్న కరకట్ట భవనం కూడా లింగమనేనిదే అని ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది.

అంటే, లింగమనేనితో చెప్పి పవన్ కు చంద్రబాబే భూమిని కారుచవకగా (ఒకవిధంగా ఉచితంగానే అనుకోవచ్చు) ఇప్పించారని సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. సుమారు రూ. 50 కోట్ల విలువ చేసే రెండెకరాలకు పవన్ చెల్లించింది రూ. 40 లక్షలు మాత్రమే. అంటే ఏ స్ధాయిలో తెరవెనుక మంత్రాంగం నడిచిందో అర్ధమైపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ అంశంపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos