అప్పుడు వద్దంది... ఇప్పుడు టీడీపీయే దోచుకోవాలనుకుంటోంది.. నేను ఓట్ల కోసం రాలేదు

pawan kalyan fires on telugu desam party
Highlights

తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పెట్టాలనుకున్న ప్రాంతం సురక్షితం  కాదన్నారు. 

తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పెట్టాలనుకున్న ప్రాంతం సురక్షితం  కాదన్నారు. భూములు లాక్కోవడంలో అన్ని పార్టీలు, నేతలు అత్యాశతో ఉన్నారని ఆరోపించారు..

నాడు వాన్‌పిక్ భూములకు వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేడు దోచుకోవాలని చూస్తోందని.. రాష్ట్రంలో అన్ని చోట్లా భూదోపిడీ భారీగా జరుగుతోందని విమర్శించారు. భూ దోపిడీని అడ్డుకోవాలంటే ఓ ఉద్యమం రావాలని పవన్ ఆకాంక్షించారు.. మేధావుల ఆలోచన, దిశానిర్దేశం చేసి ఈ సమస్యను పోరాడి పరిష్కరించుకోవాలని జనసేనాని సూచించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ఉంటే బాగుంటుదని పవన్ అన్నారు... తాను ఓట్ల కోసం రాలేదని.. సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

loader