ఎన్నికల పోలింగ్ ముగియడంతో పవన్ కాస్త విశ్రాంతి లభించింది. మొన్నటి వరకు తమ పార్టీ నేతల కోసం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు.
ఎన్నికల పోలింగ్ ముగియడంతో పవన్ కాస్త విశ్రాంతి లభించింది. మొన్నటి వరకు తమ పార్టీ నేతల కోసం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో.. ఆలయాల దర్శనానికి వెళ్తున్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఆయన గుంటూరు జిల్లాలోని దశావతార వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఆలయానికి చేరుకున్న పవన్‌కళ్యాణ్‌కు ఆలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కరరావు, వెంకటసూర్య రాజశేఖర్, రమేశ్ వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్‌కళ్యాణ్ ఆలయానికి రూ.1.32కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మొత్తాన్ని స్వామివారి నిత్య అన్నదానానికి వినియోగించాలని కోరారు.
