ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కి జనసేన అధినేత పవన్ కళ్యాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. జగన్ గుర్తించనంత మాత్రనా.. తమ పార్టీకి గుర్తింపు లేదన్నట్లు కాదని పవన్ పేర్కొన్నారు. ఇటీవల జగన్.. జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ.. అదొక పార్టీగా కూడా తాను గుర్తించడం లేదంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై పవన్ తాజాగా స్పందించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అసెంబ్లీకి వెళ్లరు.. ప్రజాసమస్యలను పట్టించుకోరన్నారు. అనంతపురం జిల్లా గురించి మాట్లాడుతూ జిల్లాలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రైతులు, చేనేతలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

ఉపాధిలేక రాయలసీమ యువత వలసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నిర్మూలనకు శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికలు చేయాలన్నారు. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే పంటలను యువత పండించాలని సూచించారు. వాస్తవాలను దాచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. 

read more news

ఎక్కడి నుంచి పోటీ చేస్తానో అప్పుడే చెబుతా: పవన్

సందేశమైతే ఇచ్చారు: తెలంగాణలో మద్దతుపై తేల్చని పవన్(వీడియో)