హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్ బుధవారం నాడు  ట్విట్టర్ వేదికగా స్పందించారు.తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు.  

డిసెంబర్ 7వ,తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలసిందే. సుమారు 1.49 నిమిషాల నిడివి గల వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సందేశంలో  జనసేన కార్యకర్తలకు, తన అభిమానులకు సందేశం ఇచ్చారు.

కానీ ఈ ఎన్నికల్లో   ఏ పార్టీకి మద్దతు అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం ఎవరు మంచి పాలనను అందిస్తారో వారికే ఓటు చేసేందుకు లోతుగా విశ్లేషించాలని  ఆయన కోరారు.

 

తెలంగాణను  ఇచ్చామనే వారు.. తెలంగాణను తెచ్చామనే వారు... తెలంగాణను పెంచామనే వారు పోటీలో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎక్కువ పారదర్శకతో తక్కువ అవినీతితో ప్రజా రంజక  పాలన సాగించే వారేవరో లోతుగా విశ్లేషించి  ఓటు వేయాలని పవన్  కళ్యాణ్ సూచించారు. ముందస్తు ఎన్నికలైనందున  తాను ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నట్టు చెప్పారు.