ఆయన మరణం ‘కాపునాడు’కి తీరని లోటు..పవన్ కల్యాణ్

పిళ్లా వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణం కాపునాడుకు తీరని లోటని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. 

pawan kalyan condolences to pilla venkateswara rao death - bsb

పిళ్లా వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణం కాపునాడుకు తీరని లోటని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర కాపు నాడు సహ వ్యవస్థాపకులు, అధ్యక్షులు పిళ్లా వెంకటేశ్వర రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. వెంకటేశ్వర రావు గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కాపుల సమస్యలపై ఆయన స్పందించిన విధానాన్ని ఎన్నటికీ మరచిపోలేం. 

ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంతో తపించారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేశారు. కాపు యువత విద్య, ఉద్యోగాల్లో ఎదగాలని ఆకాంక్షించారు.  వెంకటేశ్వర రావు గారి మరణం కాపు నాడుకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. 

'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత...

కాగా, 'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కరోనా సోకి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  వంగవీటి మోహన రంగాకు పిళ్లా అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు పొందారు. 

రాష్టస్థ్రాయిలో కాపు సమస్యల పరిష్కారం కోసం పిళ్లా పని చేశారు. పిళ్లా వెంకటేశ్వరరావు మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమానికి విశేష కృషి చేసిన పిళ్లా మృతి తీరనిలోటన్నారు. పిళ్లా కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios