తాను చదవు మధ్యలో ఆపేసినా.. చదవడం మాత్రం ఇంకా ఆపలదేని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు తమ అమ్మవారి ఊరని.. ఇక్కడే పుట్టి పెరిగానని పవన్ చెప్పారు. అందుకే తనకు నెల్లూరు అంటే అభిమానం ఎక్కువని చెప్పారు. తనకు మొక్కలంటే విపరీతమైన ప్రేమ అని.. నెల్లూరులోని ఇంట్లోచెట్లు లేకపోవడం వల్లే ఇక్కడ ఉండలేకపోయానని పేర్కొన్నారు.

తాను పదోతరగతి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని చెప్పారు. తాను చదువు మధ్యలో ఆపేసినా.. చదవడం మాత్రం ఆపలేదన్నారు. చిన్నప్పుడు గొప్ప ఆశయాలేం ఉండేవి కావని.. ఎస్సై ఉద్యోగంలో చేరి ప్రజలను రక్షించాలని అనుకునేవాడినని చెప్పారు. కానీ.. తన ఇంటితోపాటు.. చుట్టాల ఇళ్లలోనూ రాజకీయ వాతావరణం ఉండటంతో రాజకీయ స్పృహ పెరిగిందన్నారు.

సాటి మనిషికి ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను పార్టీ ప్రారంభించానని చెప్పారు. ప్రజా రాజ్యం సమయంలోనూ ఆ ఉద్దేశంతోనే ఆ పార్టీకి పనిచేశానన్నారు. తాను జనసేన పార్టీ పెట్టాక.. నడపలేమంటూ కొందరు నీరుగార్చే ప్రయత్నం చేశారని.. అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదని చెప్పారు. విజయం వరించినా.. రాకపోయినా తన పోరాటం మాత్రం ఆగిపోదని స్పష్టం చేశారు.