ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన తిరుపతి ఉప ఎన్నికలో విజయం కోసం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అభ్యర్ధి ఎంపికపై చివరి వరకు మౌనం వహించిన కమలదళం.. రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపింది.

ఈ నేపథ్యంలో తన అభ్యర్థిత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని.. 200 శాతం తనకు మద్దతిస్తారని రత్నప్రభ స్పష్టం చేశారు. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారంటూ రత్నప్రభ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read:తిరుపతి ఉప ఎన్నిక: జనసేన లేకుంటే కష్టమే.. పవన్‌ను దువ్వుతున్న బీజేపీ నేతలు

ఆమె చెప్పినట్లుగానే.. పవన్ తిరుపతిలో ప్రచారానికి రానున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 3న జనసేనాని తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకు మద్ధతుగా ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కల్యాణ్. స్థానిక శంకరబాడి సర్కిల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు పవన్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఎమ్మార్‌పల్లి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కల్యాణ్ పాదయాత్ర నిర్వహించనున్నారు.