Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ మాకు చేసిందేమి లేదు, మోదీకే... : చంద్రబాబు

2014 లో బిజెపితో పొత్తు లేకుంటే మరో 20 సీట్లు అదనంగా వచ్చేవన్న చంద్రబాబు

pawan kalyan campaign only bjp party , not tdp ; chandrababu

ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని తాము నష్టపోయామన్నారు ఏపి సీఎం చంద్రబాబు నాయుడు. ఆ పార్టీతో పొత్తు లేకుంటే మరో 20 సీట్లు అదనంగా సునాయాసంగా గెలిచేవారమని అన్నారు.అయితే ఇపుడు బిజెపి నాయకులు తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే గెలిచామని ధీరాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్దిని దృష్టిలో పెట్టకుని నష్టపోతామని తెలిసి కూడా పొత్తుకు ఒప్పుకున్నానని చంద్రబాబు తెలిపారు. 

ఇక పవన్ కళ్యాణ్ కూడా తన వల్లే టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయితే ఆయన సాయంగానీ, ప్రచారం గానీ చేసింది బిజెపి పార్టీకి, నరేంద్ర మోదీకేనని గుర్తు చేశారు. టిడిపి పార్టీ వీరి వల్ల నష్టపోయిందే తప్ప లాభపడిన దాఖలాలు లేవని అన్నారు. 

తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నేరవేర్చలేక పోయారని అన్నారు. ఇది చాలదన్నట్టు ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామి తోనే కేంద్రం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. టిటిడి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులుని వాడుకుని దేవుడిని కూడా అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. లేని ఆభరణాలను ఉన్నట్లుగా నమ్మించి  అవి దొంగతనం జరిగినట్లు ఆరోపిస్తున్నారని అన్నారు. ఇదే కాకుండా తిరుమల దేవాలయాన్ని ఆర్కియాలజీ వారికి అప్పగించే కుట్ర కేంద్ర చేస్తోందని, దీనివల్ల వారణాసిలో మాదిరిగా తిరుమల లో కూడా అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయని ఆరోపించారు. తిరుమల వెంటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులుండవని చంద్రబాబు హెచ్చరించారు.

ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్లే తనకు ప్రాణబిక్ష లభించిందని సీఎం గుర్తుచేసుకున్నారు. లేదంటే అంత పెద్ద ప్రమాదం జరిగి కూడా తాను బ్రతకడమంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.  ఈ రాష్ట్రానికి తన ద్వారా ఏదో మంచి పనులు చేయించాలనే తనను బ్రతికించాని, ఆ మంచి పనులే ఇపుడు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

ఇక ప్రత్యేక హోదా విషయంలో బిజెపితో కలిసి వైసిపి రాజీనామాల నాటకం ఆడుతోందని అన్నారు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావనే ధీమాతోనే వైసిపి ఎంపీలు నాటకాలాడుతున్నారని, దీనికి బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. ఒక వేళ ఉపఎనికలు వస్తే మొన్నటి ఉపఎన్నికల్లో బిజెపి కి పట్టిన గతే ఏపిలో పడుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios