పశ్చిమగోదావరి జిల్లా:
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల గుర్తు ప్రకటించారు. తమ పార్టీ గుర్తు పిడికిలి అని స్పష్టం చేశారు. 


సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని అందుకే పిడికిలి పార్టీ గుర్తుగా ప్రకటించినట్లు తెలిపారు. అన్ని కులాలు, మతాలు ఐక్యమత్యంగా ఉండి తమ  బలాన్ని పిడికిలి రూపంలో తెలియజేస్తారని తెలిపారు. జనసేన పార్టీ అందరి పార్టీ అని అన్ని వర్గాల పార్టీ అన్నారు.