పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ప్రకటించినప్పటి నుండి మొదలు అధికార పక్షం వైసీపీ, కమ్యూనిస్టులు ఆయన మీద తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్కొక్కరు వారి స్థాయికి తగ్గట్టు పవన్ ని తిడుతున్నారు.

పెద్ద నాయకులకయితే మీడియా ఛానళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ తిడుతుంటే.... ఇక సగటు వ్యక్తులు తమ యుద్ధ క్షేత్రమైన ఆన్ లైన్ సోషల్ మీడియాల్లో తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. 

పవన్ కళ్యాణ్ సిద్ధాంత పరమైన రాజకీయాలను కొందరు ఎండగడుతుంటే.... ఇంకొంతమంది అతడు ఎన్ని సార్లు ఎన్ని పార్టీలను ఎలా మారారు అంటూ హిలేరియస్ గా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

ఒక మీమ్ లో పవన్ కళ్యాణ్ తనకు ఇన్స్పిరేషన్ గా చెప్పుకునే చేగువేరా కు కాషాయ తిలకం దిద్ది దానికి హిందుత్వ అని కాకుండా సెటైరికల్ గా బిందుత్వ అని పోస్టు చేసారు. 

ఇక మరో మీమ్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సాగించిన రాజకీయ ప్రస్థానాన్ని చూపెడుతూ ప్రజారాజ్యం, ఆ తరువాత టీడీపీ ఎలా మారాడా వివరిస్తూ హూ ఈజ్ నెక్స్ట్? అని ఒక మీమ్ ని ఫన్నీ గా క్రియేట్ చేసారు. 

ఇక మరో దాంట్లోనేమో చై గ్లాసులో కమలం వికసించినట్టు పవన్ కళ్యాణ్ ఎన్నికల గుర్తు టీ గ్లాసుతో సింబాలిక్ గా చెప్పారు క్రేజీ నెటిజెన్లు. ఇక బీజేపీలోకి వెళ్లిన టీడీపీ వాళ్ళందరిని పెట్టి మీరంతా నన్ను కాపాడాలంటే బీజేపీలో చేరనుందని, ఆయన షర్ట్ పై మాత్రం టీడీపీ జండాను ఉంచారు. 

ఇలా అనేక మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తెగ చక్కర్లు కొడుతున్నాయి.