అమరావతి: రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాము తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. 

జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుంటుందని వస్తున్న ఊహాగానాలను ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నట్లు ట్వీట్టర్లో విడుదల చేశారు. తాము ఒక్క వామపక్షాలతో మాత్రమే కలిసి వెళ్తామని స్పష్టం చేశారు.

జనసేన పార్టీతో పొత్తులపై అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారాలను నమ్మెుద్దు అని ఆ పార్టీ పిలుపునిచ్చింది. రాబోయే ఎన్నికల్లో జనసేన యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తుందని హామీ ఇచ్చారు. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని వాటిని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.