పవన్ అందుకు చాలా బాధపడుతున్నారట..!

pawan emotional speech in srikakaulam tour
Highlights

పవన్ బాధకు అసలు కారణం ఇదేనట

గత ఎన్నికలలో పోటీ చేయనందుకు  తాను చాలా బాధపడుతున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పట్లో బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి ఓట్లు చీలరాదని  తాను పోటీలో నిలబడలేదని చెప్పారు.  కానీ ఆనాడు తాను చేసిన పనికి ఈ రోజు చింతిస్తున్నానని, బాధపడుతున్నానని అన్నారు. ఎందుకు తాను కొద్ది స్థానాల్లోనైనా పోటీచేయలేదే  అని ఇప్పుడు చాలా బాధగాఉందని చెప్పారు. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలని ఆయన అన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం  జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనబడతాడని, జైహింద్‌ అంటాడని చెప్పారు. వారికి స్ఫూర్తిగానే తాను ఈ రోజు మిలటరీ చొక్కాను వేసుకున్నట్టు వెల్లడించారు.

loader