నెల్లూరు విశ్వవిద్యాలయం అవకతవకలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి : పవన్ డిమాండ్
రామోజీ ఫిల్మ్ సిటిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్శిటీ విద్యార్థులు కలిశారు.
యూనివర్శటీలో జరుగుతున్న అక్రమాల వివరించి, ప్రభత్వం ఎలా ఈ సమస్యలను పట్టించుకోవడం లేదో వారు ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు.
విద్యార్థుల సమస్యల ఫరిష్కారానికి జోక్యం చేసుకోవాలని వారు పవన్ నుప్రభుత్వాన్ని కోరారు. వారి సమస్యలను సాంతం విన్న తర్వాత, యూనివర్శిటీలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాల మీద ఆయన విచారణం వ్యక్తంచేశారు. ఈ ఆరోపణల లో నిజమేమిటో కనగొనేందుకు ఒక నిజనిర్ధారణ కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు.
విశ్వవిద్యాలయాన్నిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.
పవన్ ను కలుసుకునేందుకు విద్యార్థులు నెల్లూరు నుంచి వచ్చారు. వారితో సమావేశమయ్యేందుకు ఆయన కూడా సుముఖం వ్యక్తం చేశారు.
