గుంటూరులో జనసేన విస్తృత స్థాయి సమావేశం: బద్వేల్ ఉప ఎన్నికతో పాటు కీలకాంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలపై కార్యాచరణతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.బుధవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.
 

Pawan Calls For Jana sena Party Internal Meeting today

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆందోళనలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జనసేన (jana sena) విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం నాడు జనసేన ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  (pawan kalyan)ముఖ్య అతిథిగా పాల్గొంటారు.బుధవారం నాడు ఉదయం ఆయన  హైద్రాబాద్ (hyderabad)నుండి గన్నవరం(gannavaram airport) ఎయిర్‌పోర్ట్ కు చేరుకొన్నారు. గన్నవరం నుండి  ఆయన కారులో జనసైనికులతో కలిసి ర్యాలీ జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు.

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంపై (ap government) జనసేనాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందే ఏపీలో రోడ్ల దృస్థితిపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ఆందోళనలతో పాటుగా  మరికొన్ని ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అక్టోబర్ 30వ తేదీన బద్వేల్(badvel by poll) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పవన్ కళ్యాణ్ కడప జిల్లాకు చెందిన జనసేన నేతలతో చర్చించనున్నారు. విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.రాయలసీమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అక్టోబర్ మాసంలో టూర్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టూర్ పై  కూడ పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios