మంత్రి నారాలోకేష్ కోసం ఏమి చేయడానికైనా తామంతా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తానంటే తన సీటు ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు.

వచ్చే ఎన్నికల్లో లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు.

ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించటానికి ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు.