కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కాన్వాయ్‌కి దారి ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే అనుచరులు టోల్‌ప్లాజా సిబ్బందిపై కర్రలతో దాడికి దిగారు. 

కర్నూలు జిల్లా (kurnool district) వెల్దుర్దిలోని అమకతాడు టోల్‌ప్లాజా సిబ్బందిపై (toll plaza staff) ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ప్రత్తికొండ (pattikonda mla) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే శ్రీదేవి (Kangati Sreedevi) కాన్వాయ్‌లోని వాహనాలను టోల్‌ప్లాజా సిబ్బంది త్వరగా వదల్లేదు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వారిపై కర్రలతో దాడి చేశారు. వీరిలో ఎమ్మెల్యే అనుచరుడు సంజీవ్ రెడ్డితో పాటు మరికొందరు వున్నట్లు సమాచారం. దాడి దృశ్యాలు టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఫుటేజ్ పాతదని అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే శ్రీదేవికి మంత్రి పదవి వస్తుందనే అక్కసుతో దుష్ప్రచారం చేసేందుకు కుట్ర చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఫైర్ అయ్యింది. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది. పత్తికొండ ఎమ్యెల్యే శ్రీదేవి అనుచరుల వాహనానికి అనుమతించలేదని ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశారని దుయ్యబట్టింది. ఎమ్మెల్యే దండుపాళ్యం గ్యాంగ్ దందాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారని టీడీపీ పేర్కొంది. ఈ మేరకు టీడీపీ ఆదివారం వరుస ట్వీట్లు చేసింది. అలాగే టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

అంతకుముందు మరో వివాదంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల భూకబ్జాలకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన ఏమన్నారంటే.. ‘‘ వివాదంలో ఉన్న త‌మ కుటుంబ ఆస్తిని క‌బ్జాచేసిన‌ పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి, త‌మ‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నార‌ని మురళీమోహన్‌గౌడ్‌- జయదేవి దంప‌తులు కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర నిరసనకి దిగ‌డం.. వైసీపీ భూక‌బ్జాల దందా రాష్ట్రంలో ఏ రేంజులో సాగుతోందో స్ప‌ష్టం చేస్తోంది. 

పత్తికొండలోని సర్వే నంబరు 115, 116, 117లో 8.25 ఎకరాల భూవివాదం కోర్టులో వుండ‌గా వైసీపీ ఎమ్మెల్యే బినామీ బాబిరెడ్డి త‌న‌పేరుతో భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం ఓ త‌ప్ప‌యితే.. అందులో నిర్మాణాల‌కి దౌర్జ‌న్యంగా దిగ‌డం దారుణం. నిల‌దీసిన వృద్ధుల్ని చంపుతామ‌ని బెదిరించ‌డం వైసీపీ క‌బ్జాకోరుల అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌. వృద్ధుల‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. కోర్టు వివాదంలో వున్న భూమిని క‌బ్జాచేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…