కారంచేడులో కాల్వలోకి దూసుకెళ్లిన విషయాన్ని స్థానికులు గుర్తించి వెంటనే కారులో  ఉన్న వారిని బయటకు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఒంగోలు: Prakasamజిల్లా Karamcheduలో మంగళవారం నాడు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాల్వలోకి Car దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న వారిన బయటకు తీశారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తిమిడితపాడు వద్ద వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారును బయటకు తీసి అందులోకి వ్యక్తులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఇంకోల్లు మండలం ఇడుపులపాడులో ఓ పెళ్ళి రిసెప్షన్‌కు వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 2021 మార్చి 12న తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం లోలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో రెండు మృతదేహాల్ని గుర్తించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ(36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు(46), ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడలో బంధువులు ఉండటంతో శివరాత్రి వేడుకలకు వచ్చారు. వీరంతా తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తుండగా లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు.

ఈ ఏడాది జనవరి 12న గుంటూరు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల సమీపంలోని సాగర్‌ కుడి కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏపీ ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుంధువులు ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో పిన్నెల్లి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహనరెడ్డి క్షేమంగా బయటపడగా ఆయన భార్య లావణ్య, కూతురు సుదీక్ష చనిపోయారు. సంక్రాంతి నేపథ్యంలో దుస్తుల కొనుగోలుకు మదన్‌మోహనరెడ్డి భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి తిరిగొస్తుండగా అడిగొప్పల దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కారు నడుపుతున్న మదన్‌మోహనరెడ్డి అతికష్టం మీద బయటకు రాగలిగారు. నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది.తెలంగాణలో కూడా ఈ తరహ ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి ఎమ్మెల్యే సమీప బంధువులు ప్రయాణీస్తున్న కారు కాకతీయ కాలువలో పడింది.ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే బంధువులు ముగ్గురు మరణించారు. అయితే ఆ తర్వాత వీరంతా ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు సూసైడ్ లేఖను కూడా స్వాధీనం చేసుకొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇదే తరహ ప్రమాదం కూడా గతంలో చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాత పడ్డారు. కాలువలు, వాగులు, బ్రిడ్జిలు ఉన్న రోడ్ల వద్ద ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొంటే ప్రమాదాలను నివారించేందుకు వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు.