విజయనగరంలో పట్టాలు తప్పిన రైలు.. లోకో పైలట్‌కు గాయాలు

ఏపీలోని విజయనగరంలో ఓ ప్యాసింజర్ రైలు అదుపుతప్పింది. లోకో మోటివ్, తొలి బోగి పట్టాలు తప్పినట్టింది.
 

passenger train locomotive derailed in vizianagaram kms

ఆంధ్రప్రదేశ్‌లో ఓ భారీ ప్రమాదం తప్పింది. విజయనగరంలో ఓ రైలు పట్టాలు తప్పింది. అయితే.. లోకోమోటివ్, వెనుకాలే ఉన్న ఫస్ట్ కోచ్ పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు. ఒక్క లోకో పైలట్‌కు మాత్రమే గాయాలు అయ్యాయి.

విశాఖపట్నం నుంచి భవానిపట్నాకు వెళ్లుతున్న ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ ఈ ప్రమాదానికి గురైంది. ట్రైన్ నెంబర్ 08504 ఒడిశాలోని కలహండి జిల్లా భవానిపట్నాకు వెళ్లుతున్నది. విజయనగరం కొత్త వలస రైల్వే స్టేషన్‌లో ఈ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్‌లో ట్రైన్ ఆగిన తర్వాత బయల్దేరి వెళ్లుతుండగా.. ఈ ఘటన జరిగింది. ఒక్క లోకోమోటివ్, ఫస్ట్ కోచ్ మినహా మరే కోచ్‌ పట్టాలు తప్పలేవు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios