Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ సమావేశాలు: కరుణానిధి వేషధారణలో శివప్రసాద్‌ నిరసన

ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో కరుణానిధి వేషధారణతో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రధర్మం తెలీదని విమర్శించారు. 

parliament session tdp mp sivaprasad starts his acting skills as karunanidhi
Author
Delhi, First Published Dec 14, 2018, 3:20 PM IST

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో కరుణానిధి వేషధారణతో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రధర్మం తెలీదని విమర్శించారు. 

ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీకి ధర్మం తెలీదు, సత్యం తెలీదని విమర్శించారు. 

దేవుడి సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చడం లేదని శివప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు స్నేహ హస్తం అందిస్తే నాలుగున్నర సంవత్సరాలు మోదీ ఏపీని మోసం చేశారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. 

నాయకుడి విషయంలో కరుణానిధి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారని గుర్తు చేశారు. కరుణానిధి చెప్పిన నాయకత్వ లక్షణాలు మోదీలో లేవని అందుకే కరుణానిధి వేషంలో నిరసన తెలియజేసినట్లు శివప్రసాద్‌ చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంటు సమావేశాలు: మళ్లీ మొదలైన శివప్రసాద్ 'వేషాలు'

Follow Us:
Download App:
  • android
  • ios