పవన్ గుండుకు-పరిటాల రవికి సంబంధమే లేదు

పవన్ గుండుకు-పరిటాల రవికి సంబంధమే లేదు

‘బోడిగుండుకు మోకాలికి సంబంధం’ ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ గుండుకు, పరిటాల రవికి ఉన్న సంబంధమే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుండుకొట్టించుకుంటే దాంతో పరిటాల రవికి సంబంధం ఏంటంటూ పరిటాల సునీత మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితం పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ, ఎప్పుడో తనకు పరిటాల రవి గుండికొట్టించారంటూ జరిగిన అసత్య ప్రచారాన్ని తనంతట తానుగా ప్రస్తావించారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో పవన్ అదే ప్రస్తావనను మళ్ళీ మళ్ళీ తెచ్చారు. దాంతో ‘పవన్ గుండు-పరిటాల రవి’ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాటాపిక్ అయిపోయింది. అదే విషయమై  సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘పవన్ గుండుకొట్టుకోవటానికి తన భర్త పరిటాల రవికి ఏంటి సంబంధమం’టూ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా మండిపడ్డారు.

తాను గుండికొట్టించుకోవటంలో తన భర్త రవికి ఎటువంటి సంబంధమూ లేదని స్వయంగా పవనే చెప్పారు కదా? ఇంకేంటి మీకు సందేహం? అంటూ మీడియాపై ఆగ్రహించారు. తన భర్త రవి, పవన్ కు గుండు కొట్టించాన్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కూడా జనాలకు సునీత విజ్ఞప్తి చేశారు. తన గుండుపై పవన్ చెప్పిందే నిజమని కూడా సునీత అన్నారు.

2014లో రాష్ట్రాభివృద్ధి కోసమే పవన్ ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. పనిలో పనిగా సునీత వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన కూడా మండిపడ్డారు. అనుభవజ్ఞుడు చంద్రబాబునాయుడు సారధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే విపక్షం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నట్లు తేల్చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos