అనంతపురం: అనంతపురంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ సహా టీడీపీ కార్యకర్తలు శుక్రవారం నాడు ధర్నా నిర్వహించారు.

సాక్షికి వ్యతిరేకంగా పరిటాల వర్గీయులు అక్కసును వెళ్లగక్కారు. దీనిపై రాఫ్తాడు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  వాస్తవాలను బయటపెడుతున్నందనే ఉద్దేశ్యంతోనే పరిటాల వర్గీయులు ధర్నాలు చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

పరిటాల కుటుంబం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నందుకే సాక్షిపై పరిటాల కుటుంబం ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.