మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ దంపతులు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో సోమవారం  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి పనబాక లక్ష్మీ దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పనబాక లక్ష్మికి తిరుపతి టికెట్ ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నేత చంచలబాబు యాదవ్ కూడా టీడీపీలో చేరారు. కండువాలు కప్పి చంద్రబాబు పార్టీలోకి అహ్వానం‌ పలికారు.