Asianet News TeluguAsianet News Telugu

పామర్రులో బాలిక అనుమానాస్పద మృతి కేసు.. అత్యాచారం జరిగినట్లుగా అనుమానం, అవమానం తట్టుకోలేకే..?

కృష్ణా జిల్లా పామర్రులో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం జరగడంతో అవమాన భారం భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

pamarru minor girl mysterious death case updates ksp
Author
First Published Jul 23, 2023, 9:35 PM IST

కృష్ణా జిల్లా పామర్రులో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20న స్కూల్‌కి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొవ్వ మండలం మంత్రి పాలెం కాలువలో బాలిక మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. 

బాలికపై కొండిపర్రుకు చెందిన లోకేష్, నరేంద్రలు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అవమానం భారం తట్టుకోలేక బాలిక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని వుండొచ్చని భావిస్తున్నారు. నిందితులపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు తమ బిడ్డ క్షేమంగా ఇంటికి తిరగి వస్తుందని భావించిన తల్లిదండ్రులు.. కుమార్తెను విగత జీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios