Asianet News TeluguAsianet News Telugu

ఆశోక గజపతి రాజు మాకు మహారాజు... మా మనోభావాలతో ఆడుకోవద్దు: విజయసాయికి పల్లా హెచ్చరిక

ఎంతో ఘనచరిత్ర ఉన్న పివిజి రాజు కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని... అలా చేసి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని వైసిపి నాయకులను టిడిపి నాయకులు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. 

palla srinivas rao warning to vijayasai reddy akp
Author
Visakhapatnam, First Published Jun 17, 2021, 1:25 PM IST

విజయనగరం: అశోక్ గజపతి రాజు మాకు మహారాజు... అలాంటి గొప్పవ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైసిపి నాయకులకు టిడిపి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న పివిజి రాజు కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని... అలా చేసి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని పల్లా హెచ్చరించారు. 

''అశోక గజపతిరాజును సింహాచల దేవస్థాన చైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారు. సింహాచల భూములు పై టిడిపి జీవో లు తెస్తే ...ఎవరు కోర్ట్ కు వెళ్లారో మీకు తెలియదా? సింహాచల దేవస్థాన భూములు ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలి. మాన్సాస్ ట్రస్ట్ భూములుపై ఎందుకు దృష్టి పెట్టారో... విజయసాయిరెడ్డి చెప్పాలి'' అని పల్లా ప్రశ్నించారు. 

అశోక గజపతి రాజు కుటుంబ చరిత్ర తెలిసిన స్థానిక నాయకులు ఆయన గురించి మాట్లాడితే గౌరవంగా ఉంటుంది కాని ఎక్కడ నుంచో వచ్చి మాట్లాడటం సరికాదన్నారు. ఇకనైనా ఆయనను అవమానించేలా మాట్లాడవద్దని వైసిపి పాయకులకు పల్లా శ్రీనివాసరావు సూచించారు. 

 read more దోపిడిదారులకు మాన్సాస్ ట్రస్ట్‌లో స్థానం లేదు: ఆశోక్‌గజపతిరాజు

ఇదిలావుంటే బుధవారం అశోక్ గజపతి రాజుపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన దొడ్డిదారిన మళ్లీ సింహాచలం దేవస్థానం ఛైర్మన్ అయ్యారంటూ ఆరోపించారు. హైకోర్ట్  తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తున్నామని తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విజయం సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజును అతి త్వరలో ఛైర్మన్ కుర్చీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

అలాగే మాన్సాస్ ట్రస్ట్‌లో 14 విద్యాసంస్థలు వున్నాయని.. పదేళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదని ఆయన ఆరోపించారు. ఆడిటింగ్‌లో అవకతవకలు వున్నట్లు తేలితే సీఎం చర్యలు తీసుకుంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సింహాచల భూముల రక్షణకు ప్రహారీగోడ నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్‌లో లేని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని విజయసాయి వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios