Asianet News TeluguAsianet News Telugu

సిఎంగా పళనిస్వామి

పళని పూర్తిస్ధాయి సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో 11 రోజుల రాజకీయ అనిశ్చితికి తెరపడింది.

Palani swami sworn in as CM

తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రమాణస్వీకారం చేసారు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం స్ధానంలో పళని పూర్తిస్ధాయి సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో 11 రోజుల రాజకీయ అనిశ్చితికి తెరపడింది. పళనితో పాటు 31 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. వీరందరి చేత గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేయించారు. ఎంఎల్ఏలతో కలిసి రిసార్ట్స్ నుండి పళని బయలుదేరి రాజ్ భవన్ కు చేరుకున్నారు. జయలలిత హయాంలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారందరూ కొలువుదీరారు. పన్నీర్ సెల్వం హయాంలో కూడా ఎవరినీ మార్చలేదు. దాంతో అదే మంత్రివర్గం ఇపుడు కూడా కొనసాగుతోంది. మంత్రివర్గంలో ఐదుగురు మహిళలున్నారు.