పలమనేరు వైసీసీ ఎమ్మెల్యే వెంకటగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం నాయకులు, అధికారులు లంచం అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని పిలుపు ఇచ్చారు.
పలమనేరు వైసీసీ ఎమ్మెల్యే వెంకటగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం నాయకులు, అధికారులు లంచం అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని పిలుపు ఇచ్చారు.
అలాంటి వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదని వెంకటగౌడ అన్నారు. చెట్టుకు కట్టేసిన తర్వాత పోలీసులు, లేదా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.
నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం లబ్దిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వెంకటగౌడ ఆరోపించారు.
అలాంటి ఘటనలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ఎమ్మెల్యే వెంకట గౌడ వ్యాఖ్యానించారు.