పాలకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
దేశంలో గిరిజనులు అధికంగా వుండే సెగ్మెంట్లలో పాలకొండ కూడా ఒకటి. పాలకొండ ప్రాంతానికి బ్రిటీష్ హయాం నుంచి చారిత్రక నేపథ్యం వుంది. పాలకొండలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్లు, వైసీపీ రెండేసి సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కళావతి కృతనిశ్చయంతో వున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి విషయానికి వస్తే.. పాలకొండ నుంచి జనసేన అభ్యర్ధి పోటీ చేయనున్నారు. కానీ నేటి వరకు ఇక్కడ అభ్యర్ధిని ప్రకటించలేదు. నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపురావడంతో ఆయన పోటీ ఖాయమని అంతా భావించారు.
ఆంధ్రా ఒడిషా సరిహద్దులకు అత్యంత చేరువలో వుండే నియోజకవర్గం పాలకొండ. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ తల్లి కొలువుదీరిన ప్రాంతం. దేశంలో గిరిజనులు అధికంగా వుండే సెగ్మెంట్లలో పాలకొండ కూడా ఒకటి. 1955, 1962లలో జనరల్ స్థానంగా వున్న పాలకొండ.. 1967 ఎన్నికల నుంచి ఎస్సీ నియోజకవర్గంగా ప్రస్థానం సాగించింది. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఈ సెగ్మెంట్ ఎస్టీ నియోజకవర్గమైంది.
పాలకొండ ప్రాంతానికి బ్రిటీష్ హయాం నుంచి చారిత్రక నేపథ్యం వుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పాలకొండ సెగ్మెంట్ పరిధిలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వంగర మండలాలు వుండేవి. పునర్విభజన అనంతరం కొత్తూరు నియోజకవర్గ పరిధిలోని భామిని, వీరఘట్టం, సీతంపేట మండలాలు పాలకొండ కిందకు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,414 మంది.
పాలకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :
పాలకొండలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్లు, వైసీపీ రెండేసి సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల విషయానికి వస్తే.. వైసీపీ అభ్యర్ధి వీ కళావతికి 72,054 ఓట్లు.. టీడీపీ 54,074 ఓట్లు పోలయ్యాయి. వరుసగా రెండోసారి కళావతి పాలకొండలో విజయం సాధించారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కళావతి కృతనిశ్చయంతో వున్నారు. సీఎం జగన్ సైతం అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు. వైసీపీ సంక్షేమ పాలన, కేడర్‌తో కలుపుకుని పోవడంతో కళావతి మరో విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు.
పాలకొండ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. కూటమి అభ్యర్ధి ఎవరు :
టీడీపీ బీజేపీ జనసేన కూటమి విషయానికి వస్తే.. పాలకొండ నుంచి జనసేన అభ్యర్ధి పోటీ చేయనున్నారు. కానీ నేటి వరకు ఇక్కడ అభ్యర్ధిని ప్రకటించలేదు. ఈ విషయంలో రోజుకో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు కుమారుడు జయకృష్ణ టీడీపీ తరపున టికెట్ ఆశించారు. కానీ పడాల భూదేవీని మరో వర్గం ప్రోత్సహిస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో పాలకొండ సీటును జనసేనకు కేటాయించడంతో రాజకీయం రసకందాయంలో పడింది. నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపురావడంతో ఆయన పోటీ ఖాయమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా భూదేవి జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన జయకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా పవన్ కళ్యాణ్‌ను కూడా కలిశారు. మరి ఇక్కడ కూటమి అభ్యర్ధి ఎవరన్నది త్వరలోనే తేలిపోనుంది.
- Palakonda Assembly constituency
- Palakonda Assembly elections result 2024
- Palakonda Assembly elections result 2024 live updates
- andhra pradesh assembly elections 2024
- ap assembly elections 2024
- bharatiya janata party
- chandrababu naidu
- congress
- janasena
- pawan kalyan
- tdp janasena alliance
- telugu desam party
- ys jagan
- ys jagan mohan reddy
- ys sharmila
- ysr congress party