పశ్చిమ గోదావరి  జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో   వైసిపి దెబ్బకు టిడిపి విలవిల్లాడిపోయింది... కానీ కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి విజయం సాధించగలిగింది. అలాంటి నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. మరి ఈసారి అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ నెలకొంది. మరి ఇప్పుడు పాలకొల్లు రిజల్ట్ ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 

పాలకొల్లు రాజకీయాలు : 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ఇప్పటివరకు గెలుపన్నది ఎరుగని నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి బలంగా వున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ 1983 నుండి ఇప్పటివరకు టిడిపి ఆరుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు విజయం సాధించింది. మొదట 1983, 85 లో ఓసారి, 1994,99 లో మరోసారి అల్లు వెంకట సత్యనారాయణ వరుసగా గెలుపొందారు. ఆ తర్వాత 2004 లో సత్యనారాయణమూర్తి (బాబ్జీ) గెలిచారు. ఇక గత రెండుసార్లుగా (2014, 2019) నిమ్మల రామానాయుడు పాలకొల్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. 


పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. యలమంచిలి
2. పాలకొల్లు
 3. పోడూరు 

పాలకొల్లు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,90,192
పురుషులు - 93,747
మహిళలు ‌- 96,434

పాలకొల్లు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గూడాల శ్రీహరి గోపాలరావు వైసిపి అభ్యర్థిగా పాలకొల్లు అసెంబ్లీలో పోటీ చేస్తున్నారు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ మరోసారి పాలకొల్లు నుండి నిమ్మల రామానాయుడును బరిలోకి దింపుతోంది. గత రెండు పర్యాయాలుగా పాలకొల్లులో విజయం సాధిస్తున్న రామానాయుడు హ్యాట్రిక్ పై కన్నేసారు.

పాలకొల్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పాలకొల్లు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,56,421 (82 శాతం)

టిడిపి - నిమ్మల రామానాయుడు - 67,549 ఓట్లు (40 శాతం) - 17,809 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిప - సత్యనారాయణమూర్తి - 49,740 (31 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - గుణ్ణం నాగబాబు - 32,984 (21 శాతం) - ఓటమి

పాలకొల్లు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,42,034 (83 శాతం)

టిడిపి - నిమ్మల రామానాయుడు - 51,523 (36 శాతం) ‌- 6,383 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - మేకా శేషుబాబు - 45,140 (31 శాతం) - ఓటమి