పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి అక్రమంగా వెళ్లిన 20 మంది భారత మత్స్యకారులను  ఆ దేశం జైళ్ల నుంచి విడుదల చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  మత్స్యకారులను ఆంధ్రాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరపున మంత్రి మోపిదేవి వాఘాకు బయల్దేరారు.

Also Read:పాక్ చెరలో తెలుగు టెక్కీ కేసులో ట్విస్ట్ విశాఖ పోలీసుల హైరానా, ఐదేళ్ల క్రితమే...

ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన మోపిదేవి.. సోమవారం వాఘా బార్డర్ వద్ద మంత్రికి ఏపీ జాలర్లను పాకిస్తాన్‌ అధికారులు అప్పగించనున్నారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు 2018 నవంబర్‌లో గుజరాత్ తీరంలోకి చేపల వేటకు వెళ్లారు.

Also Read:మోడీకి జై కొట్టాల్సిందే.. కానీ టీడీపీలోనే ఉంటా: అంతుచిక్కని జేసీ అంతర్యం

ఈ క్రమంలో పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించిన 28 మంది జాలర్లను పాకిస్తాన్ కోస్ట్ గార్డు అదుపు చేసింది. వీరిని విడిపించడానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. వారి కుటుంబసభ్యులు సైతం తమ వారిని విడిపించాల్సిందిగా టీడీపీ, వైసీపీ ఎంపీలను కలిశారు.

దీనిపై నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌‌ను కలిశారు. మత్స్యకారుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 20 మంది కాగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు నలుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నా