అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతోపాటు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం రద్దు కావడంతో నామినేటెడ్ పదవుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. 

తాజాగా వారి జాబితాలో చేరారు ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య. ఏపీఐఐసీ  చైర్మన్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. తెలుగుదేశం పార్టీలో మీడియా కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు కృష్ణయ్య. ఇకపోతే కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడం విశేషం.