నువ్వు మాకేం చేశావ్.. ‘మీరు ఓటేస్తేనే గెలవలా’..? మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

P Gannavaram MLA Satyanarayanamurthy fires on women
Highlights

ఎంతో కాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తిని అంబాజీపేటలో మహిళలు రాశారు. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. మీరు వేసిన ఓట్లతో తాను గెలవలేదంటూ వాగ్వివాదానికి దిగారు.ల

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీసినందుకు వారితో వాగ్వివాదానికి దిగారు ఓ ఎమ్మెల్యేగారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే నారాయణమూర్తి  గృహమస్తు కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబాజీపేటలోని లంకవారిపేటకు వచ్చారు.

తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం గురించి పట్టించుకోవాలని ఆ కాలనీవాసులు ఎన్నో రోజులుగా అధికారులు దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎమ్మెల్యేను కూడా కలిశారు.. కాని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అక్కడివారు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ వారికి ఎమ్మెల్యే కనిపించడంతో తమ సమస్యలు తీర్చకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ మహిళలు నిలదీశారు..

వారికి ఆయన ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా మహిళలు వినలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి మీరొక్కరు వేసిన  ఓట్లతోనే తాను గెలవలేదంటూ ఫైర్ అయ్యారు.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

loader