తన దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతిపై యజమాని కన్నేశాడు. యువతికి తెలీకుండా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగి స్పృహ కోల్పోయిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా కాలేజీలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకులే అని.. యువతి ఓ దుకాణంలో పనికి చేరింది. ఆ డబ్బుతో ఇంట్లో వారికి ఆసరాగా నిలవాలని ఆశపడింది.

అందుకే.. దుకాణంలో నెలకు రూ.5వేల జీతం కోసం పనిచేస్తోంది. దాని యజమాని సోమవారం దుకాణంలో ఎవరూ లేని సమయంలో.. యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అతి తెలియని యువతి ఆ కూల్ డ్రింక్ తాగి స్పృహ కోల్పోయింది.

ఆ తర్వాత సదరు యజమాని.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెళకువ వచ్చిన తర్వాత విషయం అర్థం చేసుకున్న యువతి వెంటనే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.