విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోం: రాజ్యసభలో విజయసాయిరెడ్డి

విశాఖ స్టీల్ ప్రాంట్ ప్రైవేటీకరణకు తాము అంగీకరించబోమని వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారంనాడు రాజ్యసభలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆయన రాజ్యసభలో ప్రసంగించారు.

our government not allow to privatisation of visakha steel plant says ysrcp MP Vijayasai Reddy lns


విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్రాంట్ ప్రైవేటీకరణకు తాము అంగీకరించబోమని వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారంనాడు రాజ్యసభలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆయన రాజ్యసభలో ప్రసంగించారు.

 ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నాయన్నారు.  వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేశారు. ‘‘ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయన్నారు.

 కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదు’’ అని  ఆయన అభిప్రాయపడ్డారు. ఇక స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ కొరత ఉందన్నారు.  సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో  ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios