రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏయే అంశాలు పెండింగులో ఉన్నాయో ఆయన వివరించినట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ప్రజలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్న సంగతి కూడా ఆయన వివరించారు.

రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో చోటు కల్పించిన విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాేవేశమయ్యారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రధానికి నివేదించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏయే అంశాలు పెండింగులో ఉన్నాయో ఆయన వివరించినట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ప్రజలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్న సంగతి కూడా ఆయన వివరించారు.
జగన్ ప్రధాని ముందు ప్రస్తావించిన అంశాలలో ఏపీకి ప్రత్యేక హోదా జాప్యం, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, రాఫ్ట్ర వ్యాపితంగా మిర్చి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, రా ష్ట్రా క్యాబినెట్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కల్పించడం తదితర అంశాలను వైఎస్ జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది.
. వైఎస్ జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి,మిథున్ రెడ్డి కూడా ప్రధానితోజరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
