ఆంధ్రప్రదేశ్‌కు నడిబొడ్డున్న ఉన్న ఒంగోలు అన్ని కుదిరితే రాష్ట్రానికి రాజధానిగా వుండాల్సింది. ఎన్నో ప్రత్యేకతలుండి, అన్ని రకాలుగా వెనుకబడింది ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఒంగోలు ముఖ్య కేంద్రం. హేమాహేమీలైన నాయకులను దేశానికి అందించింది ఈ గడ్డ. అంతేకాదు.. అలనాటి దిగ్గజ నటుడు కొంగర జగయ్యను పార్లమెంట్‌కు పంపింది ఒంగోలు . తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఒంగోలు లోక్‌సభ స్థానం కంచుకోట. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా.. టీడీపీ , వైసీపీ, స్వతంత్రుడు రెండు సార్లు గెలిచారు. ఒంగోలు లోక్‌సభలో టీడీపీ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది.
మంచికి మంచి.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వుంటాయి ఒంగోలు రాజకీయాలు. పేరుకు కోస్తా జిల్లా అయినా రాయలసీమ రాజకీయానికి ఏమాత్రం తీసిపోదు. తూర్పున సముద్రం.. పశ్చిమాన నల్లమల అడవులతో ప్రశాంత వాతావరణాన్ని తలపించే ఒంగోలు రాజకీయాలు మాత్రం కాకరేపుతూ వుంటాయి. పంతానికి దిగితే ఎంతవరకైనా అన్నట్లుగా వుంటారు ఒంగోలోళ్లు. కుల సమీకరణలు, ఆధిపత్య పోరు, ముఠా కక్షలు, కుమ్ములాటలకు ఒంగోలు పెట్టింది పేరు.
ఆంధ్రప్రదేశ్‌కు నడిబొడ్డున్న ఉన్న ఒంగోలు అన్ని కుదిరితే రాష్ట్రానికి రాజధానిగా వుండాల్సింది. ఎన్నో ప్రత్యేకతలుండి, అన్ని రకాలుగా వెనుకబడింది ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం. విశాలమైన సముద్ర తీరం, చెన్నె-కోల్‌కతా మెయిన్ లైన్, చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు గిత్తలున్నాయి. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఒంగోలు ముఖ్య కేంద్రం. హేమాహేమీలైన నాయకులను దేశానికి అందించింది ఈ గడ్డ. అంతేకాదు.. అలనాటి దిగ్గజ నటుడు కొంగర జగయ్యను పార్లమెంట్‌కు పంపింది ఒంగోలు .
ఒంగోలు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీ కంచుకోట :
తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఒంగోలు లోక్‌సభ స్థానం కంచుకోట. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించగా.. టీడీపీ , వైసీపీ, స్వతంత్రుడు రెండు సార్లు గెలిచారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,56,469. వీరిలో పురుష ఓటర్లు 7,75,107 మంది.. మహిళా ఓటర్లు 7,81,275 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 13,42,368 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఒంగోలు లోక్‌సభ పరిధిలో యర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు సెగ్మెంట్లలో 6 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా.. టీడీపీ ఒక చోట గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డి 7,39,202 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి శిద్దా రాఘవరావుకు 5,24,351 ఓట్లు, జనసేన అభ్యర్ధి బెల్లంకొండ సాయిబాబుకు 29,379 ఓట్లు పోలయ్యాయి. మొత్తం వైసీపీ 2,14,851 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ విజయం సాధించింది.
ఒంగోలు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. పాతికేళ్లుగా గెలవని టీడీపీ :
2014, 2019లలో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న వైసీపీ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. మరోసారి పోటీ చేయాలని భావించిన సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి జగన్ నో చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. వైసీపీ నుంచి సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అభ్యర్ధిగా అధిష్టానం ఖరారు చేసింది.
టీడీపీ విషయానికి వస్తే.. మాగుంట ఫ్యామిలీ సైకిలెక్కేందుకు సన్నాహాలు చేస్తోంది. శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి దాదాపు టికెట్ కన్ఫర్మ్. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన మాగుంటను ఎదుర్కోవడం అంత తేలికైన పనికాదు. ఒంగోలు లోక్‌సభలో టీడీపీ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కరణం బలరాం ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా ఒంగోలును ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది.
